ఐటీ అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని అందించాం: మై హోమ్ గ్రూప్

  • బెంగళూరుకు చెందిన సంస్థతో మాకు జాయింట్ వెంచర్ ఉంది
  • ఈ సంస్థపై జరిగిన దాడుల్లో భాగంగానే మాపై దాడులు
  • అధికారులు అడిగిన సమాచారాన్ని ఇచ్చాం
మై హోమ్ గ్రూపు సంస్థపై గత రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులపై ఆ సంస్థ స్పందించింది. ఈ దాడులు నేరుగా తమ సంస్థపై జరగలేదని తెలిపింది. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీపై జరిగిన దాడుల్లో భాగంగానే తమపై కూడా దాడులు జరిగాయని చెప్పింది. హైదరాబాదులో బెంగళూరుకు చెందిన ఆ సంస్థతో తమకు జాయింట్ వెంచర్ ఉందని... ఈ కారణంగానే తమపై దాడులు జరిగాయని తెలిపింది. ఐటీ అధికారులు కోరిన సమాచారాన్ని అందజేశామని చెప్పింది. తాము విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహిస్తామని, నియమనిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తామని తెలిపింది. తమ సంస్థకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పింది.
Go Back to Shorts
My Home
IT
Raids
Hyderabad

More Telugu News